ఒకప్పుడు హీరోయిన్ సోనాలి బింద్రే టాలీవుడ్ ను ఏలారు. టాలీవుడ్ లో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తన బ్లాక్ బస్టర్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వివాహానంతరం టాలీవుడ్ కు సోనాలీ దూరమయ్యారు. అయితే ఇటీవల ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమె నటించబోతున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ఆమె చాలా కాలం వరకు క్యాన్సర్ తో పోరాడారు. ఆ తర్వాత క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా ఆమె టాలీవుడ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో సోనాలి నటించబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమాపై ఇప్పటికే మూవీ మేకర్స్ సోనాలినిని కాంటాక్ట్ చేశారని, ఇక ఒప్పుకోవడమే తరువాయి అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.