కామాంధుడి చేతిలో బలైన గిరిజన బాలికకు న్యాయం జరగాలని తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలు. విశాఖ జిల్లా పాడేరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నరరూప రాక్షుసుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. పలువురు విద్యార్థినులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు.
Advertisements