ప్రపంచంలోని అత్యుత్తమ సినీ ఈవెంట్లలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఒకటి. 75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 17న ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మే 28 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది ఫెస్ట్‌లో పాల్గొనేందుకు స్టార్స్ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే తళుక్కుమంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
టాలీవుడ్ బుట్టబొమ్మ ఫస్ట్ టైం ఈ వేడుకలో ఫాల్గొంది. ఇందులో భాగంగా పూజా హెగ్డే రెండో రోజు ట్రెండీ డిజైనింగ్ పింక్ కలర్ గౌనులో అక్కడ రెడ్ కార్పెట్‌పై నడిచి తన సోయగాలతో.. అభిమానుల చూపు తిప్పుకోనీయకుండా చేసింది. ఈ సారి కేన్స్‌లో ఇండియా సినిమాకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ఓపెనింగ్‌లో దీపికా, తమన్నా, హినా ఖాన్‌లతో కలిసి పూజా హెగ్డే పాల్గొంది.
ఈ సందర్భంగా బుట్టు బొమ్మ మాట్లాడుతూ.. తనుకు చాలా సంతోషంగా ఉందని, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని రెడ్ కార్పెట్‌పై వాక్‌చేయడం తన డ్రీమ్ అని పూజా హెగ్డే చెప్పింది. అయితే తాను ఏదో ఒక బ్రాండ్ నుంచి రిప్రజెంట్ చేయడానికి రాలేదని, బ్రాండ్ ఇండియా తరఫున ప్రతినిధిగా వచ్చానని పూజా చెప్పడం అందరిని ఆకట్టుకుంది. ఇండియన్ సినిమాని ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చానని పూజా చెప్పిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ చిత్రాలు ఫ్లాప్ అయినా పూజా అందాలు మాత్రం ఆడియెన్స్‌ని కనువిందు చేశాయి. ప్రస్తుతం ఆమె మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో నటించబోతుంది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలు, హిందీలో సల్మాన్ ఖాన్ మూవీ `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తోంది.