ఈనెల 17న ప్రారంభం కానున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకం. ఇది 75వ ఎడిషన్ కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది. అయితే.. ఈ ఫెస్టివల్ లో మన దేశం నుంచి ఎవరు పాల్గొంటారా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా మొత్తం లిస్ట్ బయటకొచ్చింది.
దేశంలోని సుప్రసిద్ధ తారలు రెడ్ కార్పెట్ పై తళుక్కుమనేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలవురు నటీనటులు, సంగీత దర్శకులకు ఈసారి ఇందులో పాల్గొనే అవకాశం దక్కింది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, పూజ హెగ్డె సహా పలువురు రెడ్ కార్పెట్ పై మెరవనున్నారు.
ఇప్పటికే ఇందులో పాల్గొనే వారికి ఆహ్వానాలు కూడా అందాయి. అయితే.. ఈసారి ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజా హెగ్డే స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఆమె ఈ వేడుకలో అరంగేట్రం చేయనుంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే సినీ ప్రముఖులు
అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, నయనతార, తమన్నా, ఏఆర్ రెహమాన్, మామే ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ప్రసూన్ జోషీ, మాధవన్, రిక్కీ కేజ్, శేఖర్ కపూర్