బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అనే మాట వాస్తవం. ప్రభాస్ సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు ప్రభాస్ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. అయితే ప్రభాస్ తో బాహుబలి తర్వాత సినిమా చేసిన ముగ్గురు హీరోయిన్లకు ఏ మాత్రం కలిసి రాలేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటించింది. ఆ సినిమా అనుకున్న విధంగా హిట్ కాలేదు. వసూళ్లు మాత్రం భారీగానే వచ్చాయి. హీరోయిన్ కి ఈ సినిమా కలిసి రాలేదు అనే చెప్పాలి. ఇక అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన జాక్వేలిన్ కి కూడా పెద్దగా ఏం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఇక రాధేశ్యాం సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజ హెగ్డే.
ఈ సినిమాతో ఆమెకు భారీ అవకాశాలు జాతీయ స్థాయిలో వస్తాయని ఆశించింది. కాని పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. రష్మిక మంధనాకు అవకాశాలు ఎక్కువగా ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ తో దీపిక, కృతి సనన్ సహా మరో హీరోయిన్ నటిస్తుంది. మరి వాళ్ళ భవిష్యత్తుకి ఆ సినిమాలు ఎలా కలిసి వస్తాయో చూడాలి.