కరోనా వ్యాక్సిన్ పై సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ భిన్నంగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేశాడు. బీజేపీ ప్రభుత్వంలో ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ను తాము నమ్మలేమని, తమ ప్రభుత్వం వచ్చాకే వ్యాక్సిన్ తీసుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మేము బీజేపీ ప్రభుత్వంలో ఇచ్చే వ్యాక్సిన్ ను ఎలా నమ్మాలి, మేం వ్యాక్సిన్ తీసుకోవాలనుకోవటం లేదంటూ ఈ మాజీ సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడే వ్యాక్సిన్ వేయించుకుంటానంటూ ప్రకటించారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది
దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. రాజకీయ వైరాలున్నా తప్పులేదు కానీ మరీ ఇంతలా ఉంటే ప్రజల ప్రాణాలకు తీవ్ర నష్టమని, బాధ్యత గల నేతలు ఇలా దిగజారి మాట్లాడొద్దంటూ పలువురు మండిపడుతున్నారు.