పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. ఆయనకు సర్జరీని వైద్యులు ఆదివారం నిర్వహించారు. సర్జరీ అనంతరం కెప్టెన్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆయనతో ఫోన్ లో మాట్లాడారు.
ఇదిలా ఉంటే లండన్ భారత్ కు తిరిగి వచ్చాక కెప్టెన్ అమరీందర్ తన పంజాబ్ లోక్ దళ్ కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం చేయనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ నేతలతో అంతర్గత విభేదాల కారణంగా ఆయన గతేడాది కాంగ్రెస్ ను వీడి సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాటియాల నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.