కర్నూలు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. బావిలో కారు పడి నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద అదుపు తప్పిన కారు బావిలోకి దూసుకెళ్లింది.
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు వెళ్లి కారు అదుపుతప్పి బావిలో పడింది. కారులో మొత్తం 5 మంది ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే సహాయక చర్యలను ప్రారంభించారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.