కారు బీభత్సము - మూడడుగులు గాల్లోకి - Tolivelugu

కారు బీభత్సము – మూడడుగులు గాల్లోకి

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు అతి వేగంతో వస్తూ రాయల్ టిఫిన్ సెంటర్ ముందు డివైడర్ ను ఢీకొట్టింది. దాదాపు మూడు అడుగుల ఎత్తున గోడెక్కింది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడంతో కారులోని వారికి ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం. ఆ వెంటనే కారులో ఉన్న యువకులు పరారయ్యారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా కారు ఎవరిదన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారులోని యువకులు మద్యం మత్తులో ఉండిఉంటారనే అనుమానిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp