అర్ధరాత్రి ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అర్ద రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంతో వెళ్లిన కారు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. TS 09 EA 990 గల కారు హిమయత్ నగర్ నుండి అతి వేగంతో వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో కారులో ఉన్నవ్యక్తి భయటపడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.