వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా దూసుకువచ్చిన కారు షాప్ల పైకి దూసుకెళ్లింది. దీంతో ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్లో ఉంది. అయితే.. కారులో ఉన్న ఇద్దరు యువకులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.