హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఉదయాన్నే ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ కు బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైనట్టు వెల్లడించారు. దీంతో వాహనదారుడి పై కేసు నమోదు చేసి.. కారు సీజ్ చేసినట్టు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వారం క్రితం హైదరాబాద్ లో రెండు వేర్వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మందుబాబులు రెచ్చిపోతుండడంతో ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మందుబాబుల ఆగడాలు అరికట్టేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.