పంజాబ్ పోలీస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పటియాలాలో ఓ కారును ఆపేందుకు ప్రయత్నించాడు కానిస్టేబుల్. కానీ.. డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. పోలీస్ ను ఢీకొట్టుకుంటూ మరీ వెళ్లాడు.
పోలీసులు వాహనాన్ని ఆపుతున్నారు.. తనిఖీ నుంచి తప్పించుకోవాలని పరారయ్యాడు కారు డ్రైవర్. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
కారును ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన విచారణ కొనసాగుతుందని చెప్పారు పటియాలా డీఎస్పీ హేమంత్ శర్మ.