హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఎస్సై పల్లె రాఘవేందర్ గౌడ్ మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం…..మహబూబ్ నగర్ లోని రైల్వే పోలిస్ స్టేషన్ లో పల్లె రాఘవేందర్ గౌడ్ ఎస్సైగా పని చేస్తున్నారు.
ఆయన శనివారం ఉదయం శంషాబాద్ నుంచి తుక్కుగూడకు ఔటర్ రింగు రోడ్డు మీదుగా కారులో వెళుతున్నారు.
ఈ క్రమంలో ముందు వెళుతున్న సిమెంట్ లారీని ఆయన కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.