హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో బ్రాడ్వే పబ్ లో ఫుల్లుగా తాగి అతివేగంగా కారు నడిపాడు ఓ వ్యక్తి. ఓ వాహనం దగ్గర నిలబడ్డ బౌన్సర్ ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు.
కారు ఢీకొన్న వేగానికి బౌన్సర్ గాల్లో చక్కర్లు కొడుతూ అదే కారుపై పడి తర్వాత కిందపడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.