సాధారణంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం రూ.2 లక్షల ఖర్చవుతుంది. అంతేకాదు, దానికోసం అనుమతులు, ల్యాండింగ్‌కు పెద్ద గ్రౌండ్.. ఇలా ఆ హడావుడి అంతా ఇంతా కాదు. అదే హెలికాప్టర్ రోడ్డుపై నడిస్తే, సాధారణ కార్లలాగే రయ్.. రయ్.. అంటూ రోడ్డుపై దూసుకెళ్తుంటే.. వినడానికి కాస్తా వింతగా ఆశ్చర్యంగా ఉంది కదా.. అసాధ్యం అని కూడా అనుకుంటున్నారు కదా.. కానీ, బీహార్‌కు చెందిన ఓ యువకుడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.
బీహార్ రాష్ట్రంలోని ఖగారియా ప్రాంతానికి చెందిన దివాకర్ కుమార్ తన కారును హెలికాప్టర్‌గా మార్చాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి హెలికాప్టర్‌ను తయారు చేశారు. ఇందు కోసం అతడు రూ.3.5 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. పెళ్లి వేడుకలకు ఈ హెలికాప్టర్‌ను అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపాడు.
కొత్త కోడళ్లను అత్తారింటికి తీసుకెళ్ళడానికి, పెళ్లి మండపానికి చేరుకోవడానికి చాలా మంది హెలికాఫ్టర్లు బుక్ చేయటం ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ సౌకర్యం కొందరు డబ్బున్నోళ్లకు మాత్రమే కుదరుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు హెలికాప్టర్ అద్దెకు తీసుకోవడం అనేది ఓ కలగానే ఉండిపోతుంది. ఇలాంటి వారి కోసమే దీనిని తయారు చేశానని దివాకర్ కుమార్ చెప్పాడు.
గతంలో కూడా బీహార్ రాష్ట్రంలోని ఛప్రా గ్రామానికి చెందిన మిథిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా పైలట్ కావాలని కలలు కన్నాడు. కానీ, కాలేకపోయాడు. దీంతో తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చి దానికి తనే పైలట్‌గా మారిపోయాడు. అలాగే, భగా సిటీకి చెందిన మెకానిక్ గుడ్డు శర్మ కూడా తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చాడు. అప్పట్లో ఈ వార్తలు వైరల్ కూడా అయ్యాయి.
Bihar | Khagaria's Diwakar Kumar has modified his car to look like a helicopter
"I saw it on YouTube and thought of doing this. I have spent Rs 3.5 lakhs on the modification. I will use it for bookings in wedding ceremonies" he said pic.twitter.com/trzmItNJHb
— ANI (@ANI) April 21, 2022
Advertisements