మీరంతా టైటానిక్ సినిమా చూసే ఉంటారు. ఐస్ బర్గ్ ను ఢీకొట్టిన తర్వాత ఓడ రెండు ముక్కలవుతుంది. అచ్చం అలాంటిదే జపాన్ తీరంలో జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రతికూల వాతావరణంతో విరిగిపోయింది.
39,910 టన్నుల బరువైన ఈ భారీ కార్గో షిప్… హచినోహే పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విరిగిపోయింది. ప్రమాదం తర్వాత షిప్ లోని ఆయిల్ లీక్ అయింది. అయితే జపాన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని ఆయిల్ ను అదుపు చేశారు.
భారీగా వుడ్ చిప్స్ తో వెళ్తున్న ఈ ఓడ… ప్రతికూల వాతావరణం వల్లే విరిగిపోయినట్లు చెబుతున్నారు నిపుణులు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది.