కంప్యూటర్ కాలంలో కూడా కొన్న రాష్ట్రాల్లో ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతున్నారనడానికి అతిశయోక్తి లేదు. కనీసం రోడ్డు సౌకర్యం లేక మారుమూల పల్లే ప్రజలు ప్రజలు పడుతున్నప్పుడు కొన్న దృష్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది.
పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ స్త్రీని ప్రసవం కోసం.. రోడ్డు సౌకర్యం లేక కావడిపై మోసుకెళ్లిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముకుందపాద అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. తాలూకా కేంద్రానికి సైతం ఆ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దానికి తోడు రోడ్డుసౌకర్యం లేకపోవటం.. ఆరోగ్య కేంద్రం సైతం అందుబాటులో లేకపోవడం వల్ల ముకుందపాద గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి పురిటినొప్పులు రావడం వల్ల రోడ్డుపైకి చేరటానికి మహిళ కుటుంబసభ్యులు దాదాపు నాలుగు కిలోమీటర్లు కావడి కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
అనంతరం అక్కడినుంచి రోడ్డుమార్గంలో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.