పెద్ద సినిమాలతో సమానంగా దూసుకుపోతున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం.. ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న బాలీవుడ్ డైరెక్టర్త వివేక్ అగ్నిహోత్రి.. ఒక్కసారిగా వివాదంలో చిక్కుకున్నారు.
భోపాలీ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన అగ్నిహోత్రిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా..అదేవిషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఏకంగా పోలీసులకే ఫిర్యాదు అందింది.
ది కశ్మీర్ ఫైల్స్ విజయానందంలో ఉన్న అగ్నిహోత్రి.. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించారు.
కాగా.. భోపాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అగ్నిహోత్రిపై కేసు నమోదు చేయాలంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందడం చర్చగా మారింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.