ముందుగా చెప్పిన టైంకు కాకుండా 12నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రదర్శించినందుకు పీవీఆర్ సినిమాస్‌పై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 1955 సినిమా రెగ్యూలేషన్ యాక్ట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు ఇది వ్యతిరేకమని అవినీతి వ్యతిరేక ఫోరమ్ సంస్థ ఫిర్యాదు చేసింది. సంస్థ తరపున సాయితేజ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా… సెక్షన్స్ 9, 9A, 10 (2) కింద కేసు నమోదు చేశారు.
ఇనార్భిట్ మాల్‌లో పీవీఆర్ సినిమాస్‌లో ఈ ఆలస్యం జరిగిందని, షో టైం మద్యాహ్నం1.55కు ఉంటే… 12 నిమిషాలు ఆలస్యం చేశారని పిటిషన్‌లో ఆరోపించారు.
Advertisements
ca