ఈ జనరేషన్ వారికి యూట్యూబర్ సరయు గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో కూడా అడుగుపెట్టింది సరయు. ముఖ్యంగా తన మాటలతో సరయు హైలెట్ అవుతూ వస్తుంది. అయితే తాజాగా సరయు పై కేసు నమోదు అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆమె వ్యవహరించారు అంటూ కొందరు ఆమెపై ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఓ హోటల్ ప్రమోషనల్ పాటలో సరయుతో పాటు మరికొంతమంది గణపతి బప్పా మోరియా బ్యాండ్‌లను తలకు కట్టుకుని మద్యం సేవించారు.
అయితే ఇది హిందువులు దేవుడి బొమ్మలు దరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపే విధంగా ఉందని కాబట్టి సరయుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్. ఇలాంటి వాటిని హిందూ సమాజం సహించదన్నారు.వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి అన్నారు.
ఇక దీనిపై కేసు నమోదు చేసిన రాజన్న సిరిసిల్ల పోలీసులు కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.