అయోధ్య భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై ఎంపీ అసద్ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదయింది. సుప్రీం కోర్టుపై నాకు గౌరవం ఉంది, కానీ అయోధ్య తీర్పుతో సంతృప్తికరంగా లేము అంటూ అసద్ వ్యాఖ్యానించారు. ‘మాకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు భిక్షం వేస్తున్నారా, ఇతర ప్రాంతాల్లో మసీదు నిర్మాణం తాము చేసుకోలేమా’, అంటూ ప్రశ్నించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు భేటీ తర్వాత తాము రివ్య్యూ పిటిషన్ వేయాలా వద్దా నిర్ణయిస్తామని తెలిపారు.
అయితే, ఎంపీ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది పవన్ కుమార్ యాదవ్ జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.