పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతోంది. ‘ఉ అంటావా మావా… ఊఊ అంటావా మామాస అంటూ సాగే లిరికల్ వీడియోను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ పాటపై పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏపీలోని పురుషుల అసోసియేషన్ సమంత పాటపై కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా సాంగ్ ఉందని కంప్లయింట్ చేసింది. పాటపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈనెల 17న పుష్ప పార్ట్-1 సినిమా విడుదల అవుతోంది.