త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే వినబడుతున్నాయి.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలను నిర్వహించిన శ్రేయాస్ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు అయ్యాయి. నిబంధనలను ఉల్లఘించారని శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ గణేష్‌పై కేసులు నమోదు అయ్యాయి. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ మందికి పాసులు ఇచ్చారని, అలాగే ఈవెంట్ ను రాత్రి 11:30గంటల వరకు నిర్వహించి నిబంధనలను ఉల్లఘించారని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.