చినజీయర్ ఆధ్వర్యంలోని సమతామూర్తి ఆశ్రమానికి సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వరుసగా చినజీయర్ స్వామికి చిక్కులు ఎదురొస్తున్నాయి. భక్తులకు అమ్మే ప్రసాదంలో అవకతవకలు జరుగుతున్నాయని ఓ భక్తుడు ఫిర్యాదు చేయగానే.. పోలీసులు సమతామూర్తి నిర్వాహకులుపై కేసులు నమోదు చేశారు.
వినయ్ వంగాల అనే వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ విక్రయించే ప్రసాదం ప్యాకెట్ కొనుగోలు చేశారు. దానిపై ప్రసాదం తయారు తేదీ, కాల పరిమితిని ముద్రించలేదు. అంతేకాక ప్యాకెట్‌పై పేర్కొన్న బరువుకు, అందులో ఉన్న బరువు కూడా తేడా ఉంది. ఈ అవకతవకలకపై అక్కడ ఉన్న సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. కానీ వాళ్లు ఎవరు స్పందించకపోవటంతో వెంటనే తూనికలు కొలతలు అధికారులకు మేయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని మొత్తం తనిఖీ చేశారు.
సమతామూర్తి విగ్రమాన్ని ప్రధాని మోడీతో ఆవిష్కరింపచేసి కేసీఆర్ పేరును కూడా శిలాఫలకంలో పెట్టకపోవడంతో కేసీఆర్ అలిగారని.. అప్పటి నుంచే చినజీయర్ ను దూరం పెట్టారని ప్రచారం సాగింది. చాలా రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ మాట్లాడుకోలేదని టాక్. ఒకప్పుడు చినజీయర్ పై ఈగ వాలనీయని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టేవరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది.
అయితే డబ్బులు పెట్టి మరీ లోపలికి వస్తున్నా.. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కొందరు ఇప్పటికే ఆరోపణలు చేశారు. తాజాగా వినయ్ అనే భక్తుడు తమకు ఇచ్చే ప్రసాదం.. నాణ్యమైనది కాకపోవడంతో పాటు ఇందులో అవకతవకలున్నాయని తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.