టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వామి వివేకానందను కించపరుస్తూ ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ వివాదాస్పద పోస్టింగులు చేయడంపై అతని చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్తూ.. మంగళవారం వర్మ వరుస ట్వీట్లు చేశాడు. వివేకానందడిని ఆదర్శంగా తీసుకునే భారతీయులకు, యువకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వర్మ పోస్టులున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు వర్మపై కేసు పెట్టారు.
నిత్యం ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేయడం వర్మకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మకి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేరాలని సూచించారు. పోలీసులు ఆర్జీవీపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కోరారు.
Balavanthudaina Vivekanandudu 💪💪💪💪 pic.twitter.com/3DVg2YtX6b
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023