ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై యూపీ లాయర్ కోర్టుకెక్కారు. ఆదిపురుష్ లో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. ఇప్పటికే సైఫ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పటికీ, దర్శకుడు ఓం రౌత్, సైఫ్‌పై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్‌పూర్ కోర్టులో పిల్ వేశాడు. రావణుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వసాలను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా పిటిషన్‌లో చేర్చారు. ఇందులో రాముడిగా ప్రభాష్, రావణుడిగా సైఫ్ నటిస్తున్నారు.
రావణ పాత్ర చేయడం చాలా ఆసక్తికరంగా ఉందన్న సైఫ్, రావణుడు సీతను ఎందుకు అపహరించాడో చెప్పబోతున్నట్లు తెలిపాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమే అయినా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో సినిమాలో చూపిస్తామన్నాడు. రావణుడిలోని మానవత్వంను చూపిస్తామాన్నాడు. దీంతో పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడటంతో సైఫ్ క్షమాపణ చెప్పాడు.