కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను, తన తండ్రిని హత్య చేసేందుకు వెంకట్ రెడ్డి మనుషులు తిరుగుతున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 5న వెంకట్ రెడ్డి తమకు ఫోన్ చేశారని, ఆ విషయాన్ని హెచ్ఆర్సీ దృష్టికి తీసుకు వెళ్లారు. కోమటిరెడ్డి వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని అందువల్ల తమకు భద్రత కల్పించేలాగా పోలీసులను ఆదేశించాలంటూ ఆయన హెచ్ఆర్సీని కోరారు.
బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే ఎంపీపై స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కేసును స్థానిక పోలీసులు, డీజీపీలు సరిగా పట్టించుకోవడం లేదన్నారు. వంద కార్లలో వచ్చి చంపేస్తామని చెప్పడం భావోద్వేగం ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంపై ఇప్పటికే నల్గొండ పోలీసులకు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు చేశారు. తమనుు చంపేస్తానంటూ వెంకట్ రెడ్డి బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అవి కేవలం భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దానిపై వివరణ కూడా ఇచ్చారు.