హైదరాబాద్ లో పబ్ లపై కేసులు కొనసాగుతున్నాయి. ఈనెల 2న నిబంధనలు ఉల్లంఘించిన రెండు పబ్ లపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా మూడింటిపై కేసు ఫైల్ చేశారు. జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా, ఎయిర్ లైవ్, జీరో పార్ట్ పబ్బులపై కేసులు పెట్టారు.
ఇటీవల హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటలు దాటిన తరువాత ఎక్కువ సౌండ్స్ పెట్టకూడదని సూచించింది. తెల్లవారుజామున 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది.
హైకోర్టు చెప్పినా కూడా కొన్ని పబ్ లు నిబంధనలు పాటించడం లేదు. ఈనెల 2న శబ్ద కాలుష్యం కలిగిస్తున్న రెండు పబ్ ల మీద కేసులు నమోదు చేశారు అధికారులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని క్లబ్ రోగ్, రిపీట్ అండ్ రివోల్ట్ పబ్ ల మీద కేసులు పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీసులు. తాజాగా మూడు పబ్ లపై చర్యలు తీసుకున్నారు.