రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న క్యాసినో దందా కేసులో ఈడీ అధికారులు దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన చికోటీ ప్రవీణ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే సంపాదించారు.
ప్రవీణ్‌కు పరిచయం ఉన్న బడాబాబులందరికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ప్రవీణ్ తో ఆర్థిక సంబంధాలు కలిగిన సినీ, రాజకీయ ప్రముఖులందరికీ కూడా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.
కాగా చికోటీ ప్రవీణ్‌తో ఆర్థిక సంబంధాలతో పాటు నకిలీ బిల్లులతో వంద కోట్ల స్కాంకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఫరూక్ తార్నాకలోని విజయపూరి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈడీ అధికారులు ఆయన ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి అకౌంట్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫరూక్ దాదాపు 100 కోట్ల నకిలీ బిల్లులు స్కాం చేసినట్లు అధికారులు గుర్తించారు. తార్నాక, మలక్ పేట, కోఠి, బోయినపల్లిలోని ఫరూక్ కు చెందిన నివాసాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.