క్యాసినో గ్యాంగ్ పై ఈడీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.హైదరాబాద్ లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. క్యాసినోల ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైయ్యాయి.
ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ నివాసం, బోయన్ పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ప్రముఖులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మాధవ రెడ్డి ప్రస్తుతం వాడుతున్న కార్ కు ఎమ్మెల్యే స్టిక్కర్ గుర్తించిన ఈడీ అధికారులు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ గా అధికారులు గుర్తించారు. కార్ నెంబర్ లో కూడా మతాలబులు గుర్తించిన అధికారులు. అసలు కారు నెంబరు TS10ET 0444 కాగా 0 లేకుండా కేవలం 444ను రాసుకుని వాడుతున్న వైనం.
చీకోటి ప్రవీణ్ ఇంట్లో నిన్నటి నుంచి కొనసాగుతునే ఉన్న ఈడీ సోదాలు. ప్రవీణ్‌తో పాటు ప్రవీణ్ భార్య, కుమారుడ్ని సైతం విచారిస్తున్న ఈడీ అధికారులు. కాగా చీకోటి ప్రవీణ్‌కు టీఆర్ ఎస్ నాయకులతో సత్సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మునుపు ఒకసారి ప్రవీణ్ పుట్టిన రోజుకు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్ వంటి వారు హాజరు కావడాన్ని గుర్తించిన అధికారులు. గతంలో ప్రవీణ్ పై సీబీఐ కేసు నమోదు అయినట్లు సమాచారం.