మరో సారి వార్తల్లో నిలిచారు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. సార్వతిక్ర ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తాను ఎస్సీ సామజిక వర్గం అంటూ అఫిడవిట్ లో రిజిస్టర్ చేసుకుందని, నిజానికి శ్రీదేవి ఎస్సీ సామజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ అప్పట్లో పెద్ద రాద్ధాంతం జరిగింది. తాజాగా మరో సారి శ్రీదేవి ఎస్సీ కాదంటూ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.తాను ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, బంధువులను కూడా వెంట తీసుకుని రావచ్చని దినేష్ కుమార్ చూచించారు.