తన సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించిన ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ కు చుక్కుదురైంది. ఏపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్ పై స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ కేసులో ఏపీ సర్కారు తరుపున దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం అనుమతి లేకుండా డీజీ స్థాయి అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారని క్యాట్ ఏపీ సర్కారును ప్రశ్నించింది. అయితే ఏబీని సస్పెండ్ చేసే విషయమై హోంశాఖకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం వారం రోజులపాటు గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్(సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయించారు.ఏపీ సర్కారు తనను సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గతేడాది మే 31నుంచి తనకు జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై సస్పెన్షన్ విధించారని … తన సస్పెన్షన్ పై స్టే విధించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.