చదువుకోని వాళ్లు చేశారంటే మూర్ఖత్వం అనుకోవచ్చు. కానీ మంచి, చెడు బోధించే వృత్తిలో ఉన్నవాళ్లు మూఢభక్తితో సొంత కూతుళ్లనే చంపడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇక తల్లిదండ్రులే అలా చేశారంటే కూతుళ్లది మరో దారుణం. ఉన్నత చదువులు చదివి, ప్రపంచాన్ని చూస్తూ వారు కూడా అతీంద్రియ శక్తులను నమ్మడం విచిత్రంగా మారింది. చిత్తూరు జిల్లా జంట హత్యల కేసులో.. ఆ కుటుంబంలోని ఎవరి … [Read more...] about కలి సంహరించబడ్డాడు.. నా బిడ్డలని పోగొట్టుకున్నా!
అవీ ఇవీ...
హైదరాబాద్ నవాబు కేసును తొందరగా తేల్చండి- సుప్రీం ఆదేశం
హైదరాబాద్ నవాబు వారసత్వ కేసును తొందరగా తేల్చాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 1952 నుంచి 70 ఏళ్లుగా ఈ కేసు హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉందని సయ్యద్ జహీద్ అలీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ త్వరగా ముగించాలని తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఆదేశించారు. దిగువ కోర్టుల్లో సయ్యద్‌కే అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయని.. … [Read more...] about హైదరాబాద్ నవాబు కేసును తొందరగా తేల్చండి- సుప్రీం ఆదేశం
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ప్రైవేట్ హెల్త్ వర్కర్‌లకు కూడా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ (జగిత్యాల) వ్యాక్సిన్ తీసుకున్నారు. సంజయ్ అంతకుముందు వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఆయన టీకా వేయించుకున్నారు. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా … [Read more...] about కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
కూతుళ్లను క్షుద్రపూజల్లో బలిచ్చిన తల్లితండ్రుల సమాధానం ఏంటో తెలుసా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లెలో క్షుద్రపూజలతో ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన తలితండ్రులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నత చదువులు చదవిన వారే ఇలా తమ కూతుళ్లను చంపేంత మూడ నమ్మకాలు కలిగి ఉండటంపై విస్మయం వ్యక్తం అవుతుండగా, పోలీసుల విచారణలో వారు చెప్తున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ఆధ్యాత్మికతను ఎక్కువగా నమ్మే పురుషోత్తం … [Read more...] about కూతుళ్లను క్షుద్రపూజల్లో బలిచ్చిన తల్లితండ్రుల సమాధానం ఏంటో తెలుసా…
గోల్డ్ మెడల్ చదువులు క్షద్రపూజల మాయను పసిగట్టలేకపోయాయా…?
ఏపీలోని మదనపల్లిలో క్షుద్రపూజలతో తన ఇద్దరు బిడ్డలను చంపేసిన తల్లితండ్రులపై అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నా... క్షుద్రపూజలు చేస్తూ, తన సొంత బిడ్డలనే బలిపెట్టడంపై విస్మయం వ్యక్తం అవుతుంది. మదనపల్లి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా తండ్రి పురుషోత్తం నాయుడు పనిచేస్తున్నాడు. తల్లి పద్మజ ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. పైగా … [Read more...] about గోల్డ్ మెడల్ చదువులు క్షద్రపూజల మాయను పసిగట్టలేకపోయాయా…?
రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. మొజంజాహి మార్కెట్ తాజ్ ఐల్యాండ్, చాపెల్ రోడ్డు టీ జంక్షన్, సైఫాబాద్ పాత పీఎస్, బషీర్‌బాగ్ జంక్షన్, … [Read more...] about రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
రైతు మృతి.. అంతుచిక్కని వ్యాధే కారణమా?
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఓ రైతు అనుమానాస్పద మృతి ఆందోళన కలిగిస్తోంది. కొమిరేపల్లిలో ఏసుపాదం రైతు ఫిట్స్ వచ్చి కాలువలో పడి మరణించాడు. పశువుల మేతకోసేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే గుండెపోటుతో రైతు మృతి చెంది ఉంటాడని కొందరు భావిస్తుండగా.. అంతుచిక్కని వాధి కారణంగానే చనిపోయి … [Read more...] about రైతు మృతి.. అంతుచిక్కని వ్యాధే కారణమా?
అబద్ధాల అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు.. ది వాషింగ్టన్ పోస్ట్ కథనం
అమెరికా ప్రెసిడెంట్‌గా డోనాల్డ్ ట్రంప్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తాను పదవిలో ఉన్న నాలుగేళ్లలో ట్రంప్ ఏకంగా 30,573 తప్పుడు ప్రకటనలు చేశారని అమెరికాలోని ప్రముఖ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని రాసింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ట్రంప్ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని తెలిపింది. మరోవైపు టైమ్ మేగజైన్ ముఖచిత్రంగా … [Read more...] about అబద్ధాల అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు.. ది వాషింగ్టన్ పోస్ట్ కథనం
గుంటూరు- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్ మృతి
కరోనా వ్యాక్సినేషన్ గుంటూరులో కలకలం రేపింది. టీకా తీసుకున్న ఓ ఆశావర్కర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి ఈ నెల 19న కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత రెండు రోజులు ఏ సమస్యా లేకుండా బాగానే ఉంది. అయితే 21వ తేదీ తెల్లవారుజామున తీవ్ర చలి జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో GGHలో … [Read more...] about గుంటూరు- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్ మృతి
ధరణి- భూవిస్తీర్ణంలో తప్పుల సవరణలకు ఆప్షన్
భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మార్పులు అనివార్యమవుతున్నాయి. చాలా సమస్యలకు పోర్టల్ ద్వారా పరిష్కారం దొరక్కపోవడంతో.. మళ్లీ ప్రజలు అధికారులనే ఆశ్రయించాల్సి వస్తోంద. దీంతో తరచూ పోర్టల్‌లో కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తోంది. తాజాగా ధరణి పోర్టల్‌లో మరో ఆప్షన్‌ను పొందుపరిచారు. పొరపాటున … [Read more...] about ధరణి- భూవిస్తీర్ణంలో తప్పుల సవరణలకు ఆప్షన్