తెలంగాణలో కరోనా వైరస్ కేసులు అంతకంత పెరిగిపోతుండటంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేనందున.. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపింది. తాజా నిర్ణయంతో ఓయూ పరిధిలోని బీఎస్సీ, బీఏ, బీకామ్, బీసీఏ, బీబీఏ … [Read more...] about కరోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్
వేడి వేడిగా
యశోద ఆస్పత్రికి కేసీఆర్!
కరోనా వైరస్ బారినపడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించినట్టే హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. దీంతో ట్రీట్‌మెంట్ కోసమే వచ్చి ఉంటారని ప్రచారం జోరందుకుంది. అయితే సీటీ స్కాన్ వైద్య పరీక్షల కోసమే వచ్చారని అధికారులు చెబుతున్నారు. కేసీఆర్‌కు కరోనా ట్రీట్‌మెంట్ చేయాల్సి వస్తే ఆయన్ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికే తరలించాలని సోషల్ మీడియాలో రెండు … [Read more...] about యశోద ఆస్పత్రికి కేసీఆర్!
ఏపీలో కరోనా ఉప్పెన- ఒక్కరోజే 10 వేల కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమైంది. రాష్ట్రం ముప్పు ముంగిట నిల్చున్నా.. ప్రభుత్వం టెస్టుల సంఖ్య ఏమాత్రం పెంచడం లేదు. కానీ కేసులు సంఖ్య మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 39,619 మందికి పరీక్షలు నిర్వహిస్తే.. 9,716 మందికి పాజిటివ్ తేలింది. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా 10 మంది … [Read more...] about ఏపీలో కరోనా ఉప్పెన- ఒక్కరోజే 10 వేల కేసులు
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర ఇకపై ఎంతంటే..
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను సీరమ్ సంస్థ తాజాగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసును రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున తమ వ్యాక్సిన్‌ను విక్రయించనున్నట్టు తెలిపింది. తాము అందిస్తున్న వ్యాక్సిన్ ధర.. ఇతర దేశాల్లో లభిస్తున్న వాటి కంటే తక్కువేనంటూ … [Read more...] about కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర ఇకపై ఎంతంటే..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. కరోనా విజృంభణ కారణంగా వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు, డిమాండ్లు వస్తున్నా.. వెనక్కి తగ్గేందుకు సుముఖంగా లేదు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని సర్కార్ ఎస్ఈసీకి తెలిపింది. … [Read more...] about మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు
తిరుమల సప్తగిరుల్లోనే హనుమంతుడి జననం
తిరుమల సప్తగిరుల్లోనే హనుమంతుడి జన్మించాడని టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని, ఆకాశగంగా తీర్థంలో పన్నెండేళ్లపాటు అంజనాదేవి తపస్సు చేసిందని టీటీడీ ఆధారాలతో సహ ప్రకటించింది. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి హనుమంతుడి జన్మస్థలంపై ఆధారాలు సేకరించారని, అన్ని రకాల ఆధారాలు తీసిన తర్వాతే ఈ అధికారిక ప్రకటన … [Read more...] about తిరుమల సప్తగిరుల్లోనే హనుమంతుడి జననం
తెలుగు రాష్ట్రాలకు చేరిన మరిన్ని వ్యాక్సిన్ డోసులు
దేశంలో కరోనాపై యుద్ధంలో కీలకంగా భావిస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తృతంగా చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఓవైపు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపడుతూ, ఇటు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ స్పీడప్ పై మానిటర్ చేస్తుంది. అయితే, సెకండ్ వేవ్ భయంతో జనం స్వచ్చంధంగా వ్యాక్సినేషన్ కు ముందుకు వస్తుండటంతో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. తెలుగు … [Read more...] about తెలుగు రాష్ట్రాలకు చేరిన మరిన్ని వ్యాక్సిన్ డోసులు
ఒక్కరోజే దేశంలో 2వేలకు పైగా కరోనా మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తారాస్థాయికి చేరింది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 2 లక్షల 94వేల కేసులు కొత్తగా నమోదు అయ్యాయని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కరోనా తో ఒక్క రోజే ఏకంగా 2,020 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా.. 62,097 కేసులు రాగా, ఢిల్లీ రెండో స్థానంలో … [Read more...] about ఒక్కరోజే దేశంలో 2వేలకు పైగా కరోనా మరణాలు
తెలంగాణలో మరో 6542 కొత్త కేసులు
తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,30,105మందికి పరీక్షలు చేయగా మరో 6,542 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మరో 6,242మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. కొత్తగా చికిత్స పొందుతూ మరో 20మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 3,67,901 యాక్టివ్ కేసుల సంఖ్య- 46,488 డిశ్చార్జ్ కేసుల సంఖ్య- 3,19,537 మరణాలు- 1,876 రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కేసుల్లో … [Read more...] about తెలంగాణలో మరో 6542 కొత్త కేసులు
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ క్లారిటీ
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారంపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో మరోసారి లాక్‌డౌన్ ఉండదని సంకేతమిచ్చారు. దేశాన్ని లాక్‌డౌన్‌లోకి వెళ్లకుండా కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అటు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలని సూచించారు. మైక్రో కంటైన్మెంట్‌జోన్ల ఏర్పాటుతో .. … [Read more...] about లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ క్లారిటీ