సినిమా దర్శకులైనా, హీరోలైనా, నిర్మాతలైనా ఒక్కొరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలానే దర్శకుడు బోయపాటికి కూడా సెంటిమెంట్ ఉంది. మొదట సినిమా ప్రారంభంలో యాక్షన్ అంటూ బోయపాటి కనిపించిన తరువాతే సినిమా మొదలవుతుంది.
దానితో పాటు బోయపాటి ఇంకో సెంటిమెంట్ కూడా పెట్టుకున్నాడు. మొదట సరైనోడు సినిమాలో హీరోయిన్ కేథరిన్ ను పెట్టి మంచి హిట్ కొట్టాడు బోయపాటి. ఆ తరువాత జయజానకి నాయక సినిమా లో ఓ సాంగ్ లో కేథరిన్ కు అవకాశం ఇచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఫార్ములా మరో సారి రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
త్వరలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావటంతో ఫస్ట్ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నుంచి నయనతార వరకు అందరిని పరిశిలీస్తున్నారు. అయితే సెకండ్ హీరోయిన్ గా మాత్రం కేథరిన్ ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మరి ఈ సారి బోయపాటి సెంటిమెంట్ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.
