కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ ఐపీఎస్ సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ కేథరీన్. 2013 లో వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కేథరిన్. ఆ సినిమా విఫలమైనా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు సైతం సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు. ప్రస్తుతం కేథరీన్ విజయదేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తుంది. ఒకవైపు సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోటో షూట్ లతో కూడా హల్ చల్ చేస్తుంది.
Advertisements