ఓ కుక్క ఖరీదు 20 కోట్లంటే మీరు నమ్ముతారా .!? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.! ఓ వ్యక్తి బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిమరీ ఆ అరుదైన జాతి కుక్కును కొని అందరి దృష్టినీ ఆకర్షించారు. అసల ఆ కుక్కేంటి.! దాని లెక్కేంటి ఓ లుక్కేద్దాం.! నాణ్యమైన,ఖరీదైన కుక్కల పెంపకంలో పేరుగాంచిన సతీష్ ఆరు నెలల క్రితం ఈ అరుదైన కాకేసియన్ షెపర్డ్ ను తీసుకు వచ్చినట్లు సమాచారం..
అయితే కాకేసియన్ షెపర్డ్ జాతి ఎక్కువగా ఆర్మేనియా, సిర్కాసియా,టర్కీ, అజబైజాన్, డాగేస్తాన్ మరియు జార్జియా వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది.వివరాల ప్రకారం హైదరాబాదీ పెంపకం దారుడు ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిండెంట్ మరియు కాడుబోమ్స్ కెల్నల్ యజమానిని సంప్రదించి కుకక గురించి తెలయిజేసాడ.
కుక్కను కొనుగోలు చేసేందుకు సతీష్ ఆసక్తి చూపడంతో హైదరాబాదీ పెంపకం దారుడు దానినని రూ.20 కోట్లకు విక్రయించాడు, సతీష్ ఈ కుక్కకు “కాడబోమ్ హేడర్” అని పేరుపెట్టారు.
కుక్క వయసు సుమారు 1.5 సంవత్సరాలు. కాకనస్ ప్రాంతానికి చెందిన కాకసన్ షెపర్డ్ జాతి ఉత్తమ గొర్రెల కాపరి కుక్కలలో కలిగిఉంది. ఈ జాతికి చెందిన కుక్కలు ప్రధానంగా కాపలా కుక్కలుగా పనిచేస్తాయి మరియు రష్యాలో వాటిని కారాగారలో కూడా చూడవచ్చు.
కాకేసియన్ ప్రాంతంలో జాతులను ఎంచుకున్న తర్వాత సోవియట్ పెంపకం దారులు ఇరవయ్యవ శతాబ్దంలో ఈ జాతిని సృష్టించారు. పరిపక్వమైన కాకసన్ షెపర్డ్ 45 నుండి 70 కిలోలు భరవు ఉంటుంది. ఈ జాతి జీవితకాలం .10 -12 సంత్సరాల మధ్య ఉంటుంది.ఇదీ బ్రీఫ్ గా కాకేసియన్ కుక్క కథ..!