మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కారు ఓ బైక్ ను ఢీ కొట్టింది. కోడక్య ప్రాంతంలో రోడ్డు క్రాస్ చేస్తున్న బైకర్‌ను ఆయన కారు వేగంగా వచ్చి తాకింది. దీంతో ఆ వ్యక్తి బైక్ మీద నుంచి ఎగిరిపడ్డాడు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే… రాజ్ గఢ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాశ్ పురోహిత్ తల్లి మరణించారు. దీంతో ఆమెకు నివాళులు అర్పించేందుకు కొడాక్య గ్రామానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లారు. ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం ఆయర రాజ్ గఢ్ బయలు దేరారు.
రాజ్‌గఢ్‌కు చేరుకోగానే మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో రోడ్డు క్రాస్ చేస్తున్న బైకర్ ను ఆయన ఫార్చూన్ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. బైకర్ రాంబాబు బగ్రీకి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటగనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే దిగ్విజయ్ సింగ్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం బైకర్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.