మా ఇల్లు ఎక్కడో పోయింది… ఓ సినిమాలో చిన్నారి చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. టిక్ టాక్ ఉన్నన్నాళ్లూ బాగా ఫార్వార్డ్ అయింది. అయితే.. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ వరదల్లో కొట్టుకుపోతున్న ఇంటి వీడియో చూసినవారు అయ్యో పాపం అంటూనే.. ఈ డైలాగ్ గుర్తు చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బారియా ఘాట్ ప్రాంతంలో ఓ ఇల్లు.. వరదల్లో కాగితపు పడవలా కొట్టుకుపోతూ కనిపించింది. పైన స్లాబ్ తో సహా ఉన్న ఇల్లు.. నీటిపై తేలుతూ వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.