రైల్వేస్టేషన్.. పబ్లిక్‌గా యువతికి ముద్దుపెట్టి..

ఇదో షాకింగ్ న్యూస్.. అందరూ చూస్తుండగానే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నవీ ముంబైలోని టర్బే రైల్వే‌స్టేషన్‌లో వెలుగుచూసింది. 20 ఏళ్ల ఓ యువతి లోకల్ రైలు కోసం ప్లాట్‌ఫాంపై వెయిట్ చేస్తోంది. సదరు యువతిని వెంబడిస్తూ వచ్చిన 43 ఏళ్ల నరేష్ అనే వ్యక్తి.. ప్లాట్‌ఫాంపై యువతిని బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు.

ఆ సమయంలో తోటి ప్రయాణికులు అక్కడే ఉన్నారు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాలో గుర్తించిన రైల్వేపోలీసులు, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.