పిల్లి గుడ్డిదైతే...

పిల్లిగుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడిందనేది సామెత. అయితే, ఇక్కడ ఖైదీలు మాత్రం ఎకసెక్కాలాడలేదు. వంద శాతం ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. అనారోగ్యంగా ఉందని చెప్పి ఆస్పత్రికి పోలీసుల రక్షణతో వచ్చిన ఇద్దరు ఖైదీలు పోలీసులు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి ఒక్కసారిగా పరుగులంఘించుకున్నారు. వామ్మో ఇది తమ ఉద్యోగాలకే ఎసరు తెస్తుందనుకున్న పోలీసులు జీవన్మరణ సమస్యలా చేసుకుని మొత్తానికి ఒక్కడ్ని పట్టుకోగలిగారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మీరూ చూడండి..