వాట్సాప్.. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్టు

చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్‌ని చేధించింది సీబీఐ. వాట్సాప్ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను చెలామణి చేస్తున్న సూత్రధారిని గురువారం అరెస్టు చేసింది. పట్టుబడిన వ్యక్తి వాట్సాప్ గ్రూప్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్‌ 20 ఏళ్ల నిఖిల్‌వర్మ. నిందితుడి నుంచి కంప్యూటర్, హార్డ్‌డిస్క్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. డిగ్రీలో కామర్స్ పట్టా పుచ్చుకున్నాడు కూడా! ఈ ముఠా కార్యకలాపాలు వాట్సాప్ ద్వారా జరుగుతున్నాయి. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసింది సీబీఐ.

అంతర్జాతీయ ముఠాలో నిఖిల్ కీలక భాగస్వామి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్‌లో 114 మంది సభ్యులున్నారని, వీడియోలను చెలామణి చేయడం వీళ్ల ఉద్దేశం. వీళ్లలో కొందరు అమెరికా, పాకిస్థాన్, చైనా, శ్రీలంక, బ్రెజిల్, కెన్యా, మెక్సికో, అఫ్గనిస్తాన్ వంటి దేశాలకు చెందినవారు. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తర‌ప్రదేశ్, మహారాష్ట్రలలో సోదాలు జరుగుతున్నాయి.