టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు అక్రమ వసూళ్లకు దిగారు. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ కేంద్రంగా జరుగుతున్న ఈ వసూళ్ల పర్వంలో సీబీఐకి ఉప్పందగా, వెంటనే రంగంలోకి దిగి ముగ్గురిని అరెస్ట్ చేసింది.
రాజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. మన్నిత్ సింగ్ లంబా అనే వ్యక్తి ఇల్లు కట్టుకుండగా… అక్రమంగా నిర్మిస్తున్నారని 5లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆయన సీబీఐకి ఫిర్యాదు చేయగా… లక్ష రూపాయలను తీసుకుంటుండగా ఎంపీ నివాసంలోనే సీబీఐ వారిని స్వాధీనంలోకి తీసుకుంది.
చాలాకాలంగా వీరు ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అయితే, వీరు ఎంపీకి పీఏలు కాదని… ఎంపీ ఢిల్లీలో ఉన్న సమయంలో డ్రైవర్లుగా ఉంటారని తెలుస్తోంది.