బాలివుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యంగ్ యాక్టర్ సుశాంత్ సింగ్ మరణం..తన మరణానికి నెపొటిజం కారణమని, బాలివుడ్లో కొందరి పెద్దల పేర్లు వినిపించాయి..ముంబాయి పోలీసుల దర్యాప్తు ఆత్మహత్యగా కేస్ క్లోజ్ చేయడం.. సుశాంత్ తండ్రి కెకెసింగ్ రియాపై కేస్ ఫైల్ చేయడంతో బీహార్ పోలీసులు రంగంలోకి దిగడం.. ముంబై,భీహార్ పోలిసుల నడుమ వాగ్వివాదాలు.. రియా సుప్రింకి వెళ్ళడం..రోజుకో కథనం వెలువడడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి..
సిబిఐ విచారించాల్సిందే అంటూ సుశాంత్ అభిమానులు, కొందరు శ్రేయోభిలాషులు పట్టుపట్టారు. సుశాంత్ తండ్రి కెకెసింగ్ రియాపై కేస్ పెట్టడంతో మరో మలుపు తిరిగిన ఈ అంశం..చివరికి సుప్రింకోర్టు ఆదేశంతో సిబిఐ చేతికి చేరింది.. రంగంలోకి దిగిన వెంటనే రియా సహా ఐదుగురిపై కేస్ ఫైల్ చేసింది సిబిఐ.. A1గా రియాను,తర్వాత నిందితులుగా రియా కుటుంబసభ్యులు ,తన మేనేజర్ ల పేర్లు యాడ్ చేసిన సంగతి తెలిసిందే..ఇంతకీ రియాపై ఏఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో చూద్దాం..
Section 306 (abetment to suicide)
ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం..మన మాటల ద్వారా,ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టైతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఇది నిరూపితమైతే పది సంవత్సరాల జైలుశిక్ష మరియు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
Section 341 (wronful restraint),
అక్రమంగా అడ్డగించడం.. ఏ వ్యక్తినైనత అక్రమంగా అడ్డగించినందుకు సదరు వ్యక్తికి/వ్యక్తులుకు జైలు శిక్ష, 500 ఫైన్ ఉంటుంది.
Section 342 (wrongful confinement),
అక్రమంగా నిర్బందించడం.. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే సాధారణ జైలుశిక్ష లేదా, ఫైన్ ఉంటుంది..కొన్నిసార్లు శిక్ష పడవచ్చు, ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది.
Section 380 (theft in dwelling house),
ఇంట్లో నుండి దొంగతనం చేయుట..ఇంటి నుండి దొంగతనం చేసినట్టుగా నిరూపితమైతే 7సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది.
Section 406 (breach of trust),
నమ్మించి మోసం చేయడం..ఉద్దేశ్యపూర్వకంగా ఎవర్నైనా నమ్మించి మోసం చేసి ఆస్తిని కాజేయడం లాంటివి చేస్తే తీవ్రతను బట్టి శిక్ష రెండేళ్లు లేదా ఏడేళ్లు ఉంటుంది.
Section 420 (Cheating)
మోసం.. ఒక వ్యక్తి మరో వ్యక్తిని లేదంటే మరో వ్యక్తిని మోసం చేయడం.. ఆస్తి,విలువైన వస్తువులు ఇలా మోసపూరితంగా తీసుకోవడం..అలా మోసం చేసినట్టుగా నిరూపితమైతే జైలు శిక్ష,ఫైన్ రెండు ఉంటాయి.
Section 506 (criminal intimidation)
బెదిరింపులకు పాల్పడడం, భయానికి గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ సెక్షన్ పై కేసు పెడతారు.. ఇది నిరూపితమైతే 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది..తీవ్రతను బట్టి శిక్ష తీవ్రత కూడా ఉంటుంది.
Section 120 (B) (Criminal conspitacy)
నేరపూరితమైన కుట్ర.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నేరపూరితమై కుట్రకు ప్లాన్ వేసి వాళ్ల లబ్ది కోసం ఏమైనా చేసినట్టుగా అనుమానం ఉంటే ఈ సెక్షన్ కింద కేసుపెడతారు..నిరూపితమైతే రెండు లేదా 7 ఏళ్ల శిక్ష పడవచ్చు..ఇలాంటి కుట్ర గురించి తెలిసినవాళ్లు సమాచారం ఇవ్వకపోయినా వారు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు.