అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ… బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. తనపై ఉన్న ఐదు చార్జిషీట్లను ఒకేసారి విచారించాలన్న జగన్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ చేపట్టరాదని జగన్ వేసిన పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేయటం గమనార్హం.
ఇదే కేసులో జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు రావాల్సి ఉండగా… వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌ను సైతం గతంలోనే కోర్టు కొట్టివేసి… విచారణకు హజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.