జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. లేపాక్షి కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు గడువు కోరారు జగన్, విజయసాయి. ఈనెల 24 వరకు దాఖలు చేయకపోతే వాదనలకు సిద్ధం కావల్సిందేనని తేల్చి చెప్పింది సీబీఐ కోర్టు. అలాగే అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలని ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆదేశించింది న్యాయస్థానం.
ఇక జగన్ కేసుల్లో మంత్రి సబిత పేరును తొలగించొద్దని కోరింది సీబీఐ. పెన్నా కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని వివరించింది. అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై పెన్నా ప్రతాప్ రెడ్డి విచారణ.. నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు గడువు కోరింది సీబీఐ. ఇందూ టెక్ జోన్ కేసు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం.
అలాగే.. ఓబులాపురం గనుల కేసులపైనా సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి సబిత వాదనలు వినిపించారు. తనపై అభియోగాలు నిరాధారమని తెలిపారు. వాటిని కొట్టివేయాలని కోరారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.