ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ మంజూరైంది. ఆయనకు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను రోస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసింది. ఆయన నానమ్మ అంత్యక్రియల నేపథ్యంలో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఈ రోజు ఉదయం శరత్ చంద్రా రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆయన నానమ్మ అంత్యక్రియల నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
శరత్ చంద్రా రెడ్డి నానమ్మ ఈ నెల 25న మరణించినట్టు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గేందుకు శరత్ చంద్రారెడ్డికి అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఈ మేరకు శరత్ చంద్రారెడ్డికి రెండు వారాల బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు.
శరత్ తండ్రి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన నానమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరోవైపు గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అనుసరించి శరత్ రెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.