జగన్ కు కోర్టులో చుక్కెదురు - Tolivelugu

జగన్ కు కోర్టులో చుక్కెదురు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కోర్టులో చుక్కెదురయ్యింది. ఈడీ కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పెట్టుకున్న పిటషన్ ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈడీ కేసు విచారణలో భాగంగా సీఎం జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనపై ఎన్నో బాధ్యతలుంటాయని..అవి వదిలేసి ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం కష్టమని…కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పిటిషన్ పెట్టుకున్నారు. అతని పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp