నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు షాక్ తగిలింది. ఆమెకు 14 రోజులు రిమాండ్ ను ఢిల్లీ కోర్టు సోమవారం విధించింది.
విచారణ సమయంలో తమకు చిత్రా రామకృష్ణ సహకరించడం లేదని, ప్రతి సారీ తప్పించుకునే సమాధానాలు ఇస్తోందని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు.
కస్టడీ సమయంలో ఇంటి ఫుడ్ తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ చిత్ర తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై న్యాయమూర్తులు సీరియస్ అయ్యారు.
జ్యుడీషియల్ కస్టడీలో కూడా ఫుడ్ బాగానే ఉంటుందని, తాము చాలా సార్లు తిన్నామని న్యాయమూర్తులు అన్నారు. వీఐపీ ఖైదీ అయినందున కనీసం ప్రార్థనా పుస్తకాన్ని అనుమతించాలని కోరారు.
చిత్రా వీఐపీ ఖైదీ కాదని, వీఐపీ ఖైదీలు ప్రతి ఒక్కటీ కావాలని కోరుకుంటారని న్యాయమూర్తి అన్నారు. అలా అయితే ప్రతి నిబంధన మార్చాల్సి వస్తుందని మండిపడ్డారు.